నలుగురు ప్లేయర్లు స్వాప్‌.. ఐపీఎల్‌లో భారీ మార్పు!

కలం, స్పోర్ట్స్ : ఐపీఎల్‌ 2027కు(IPL 2027) ముందే చెన్నై సూపర్ కింగ్స్‌, సన్‌రైజర్స్ హైదరాబాద్‌ మధ్య కీలక ట్రేడ్‌ జరిగింది. ఈ ట్రేడ్‌లో మొత్తం నలుగురు ఆటగాళ్లు జట్లు మారారు. ఇంగ్లండ్‌ ఆటగాళ్లు లియామ్‌ లివింగ్‌స్టోన్‌, జాక్‌ ఎడ్వర్డ్స్‌ చెన్నై జట్టులో చేరనుండగా.. పేసర్లు ఖలీల్‌ అహ్మద్‌, నాథన్‌ ఎల్లిస్‌ హైదరాబాద్‌ జట్టుకు వెళ్లనున్నారు. గతంలో లియామ్‌ లివింగ్‌స్టోన్‌ను రూ.13 కోట్లకు తీసుకున్న హైదరాబాద్‌.. ఇప్పుడు రూ.6 కోట్ల ఒప్పందంతో చెన్నైకి పంపింది. జాక్‌ ఎడ్వర్డ్స్‌ రూ.3 కోట్ల ఒప్పందంతో సీఎస్‌కేలో చేరనున్నాడు. మరోవైపు ఖలీల్‌ అహ్మద్‌ రూ.4.8 కోట్ల ఒప్పందంతో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌కు మారాడు. గతంలో 2018 నుంచి 2021 వరకు అతడు హైదరాబాద్‌ జట్టుకే ప్రాతినిధ్యం వహించాడు. ఐపీఎల్‌ 2025లో చెన్నై తరఫున 14 మ్యాచ్‌లు ఆడి 15 వికెట్లు పడగొట్టాడు.

ఆస్ట్రేలియా పేసర్‌ నాథన్‌ ఎల్లిస్‌ రూ.2 కోట్ల ఒప్పందంతో హైదరాబాద్‌ జట్టులో చేరనున్నాడు. డెత్‌ ఓవర్లలో వైవిధ్యమైన బంతులతో ప్రత్యర్థి బ్యాటర్లను ఇబ్బంది పెట్టడం అతడి ప్రత్యేకత. ఈ ట్రేడ్‌తో చెన్నై సూపర్‌ కింగ్స్‌ బ్యాటింగ్‌, ఆల్‌రౌండర్‌ విభాగాలను బలోపేతం చేసుకోవాలని చూస్తుండగా.. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ పేస్‌ బౌలింగ్‌పై దృష్టి పెట్టింది. ఐపీఎల్‌ 2027(IPL 2027)కు ముందే జరిగిన ఈ ఆటగాళ్ల మార్పిడి క్రికెట్‌ అభిమానుల్లో ఆసక్తి రేపుతోంది.

Also Read : సౌత్‌పై బాలీవుడ్ హీరోయిన్స్ కామెంట్స్‌.. రెజీనా కౌంట‌ర్‌

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>