కలం,వెబ్ డెస్క్ : తెలంగాణలో రెండవ విడత పంచాయతీ ఎన్నికలు (Panchayat Elections) పూర్తయ్యాయి. మధ్యాహ్నం 1 గంట వరకు జరిగిన ఎన్నికల కోసం క్యూలైన్లో ఉన్న వారికి అధికారులు అవకాశం కల్పించారు. 2 గంటలకు లెక్కింపు ప్రక్రియను ప్రారంభించి విజేతలను ప్రకటించారు. అయితే, కొందరు ఎమ్మెల్యేల (MLA)కు సొంత గ్రామంలోనే ఓటర్లు షాక్ ఇచ్చారు. ఎమ్మెల్యేలు బలపరిచిన అభ్యర్థులు కాకుండా ఇతర పార్టీల వారిని గెలిపించడం చర్చనీయాంశంగా మారింది.
పంచాతయతీ ఎన్నికల్లో (Panchayat Elections) పాలమూరు జిల్లా దేవరకద్ర(Devarakadra) ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి సొంత గ్రామం చిన్న చింతకుంట మండలం దమగ్నాపూర్ బీఆర్ఎస్ పార్టీ మద్ధతు ఇచ్చిన అభ్యర్థి గెలుపొందారు. కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి భారతీ బాలకృష్ణా రెడ్డి పై బీఆర్ఎస్ నుంచి బరిలోకి దిగిన పావని కృష్ణయ్య విజయం సాధించారు. మొత్తం 10 వార్డు స్థానాల్లో ఆరింటిలో బీఆర్ఎస్ గెలుపొందగా, నాలుగు స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించారు.
పాలకుర్తి నియోజకవర్గం ఎమ్మెల్యే యశస్విని రెడ్డితో పాటు టీపీసీసీ ఉపాధ్యక్షురాలు ఝాన్సిరెడ్డి సొంత గ్రామాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు ఓడిపోయారు. యశస్విని రెడ్డి సొంత గ్రామం తొర్రూరు మండలం చెర్లపాలెం గ్రామంలో కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్థి కిరణ్ పై కాంగ్రెస్ రెబెల్ అభ్యర్థి మహేందర్ గెలుపొందారు. కాగా, ఓవరాల్ గా రెండో విడతలో కాంగ్రెస్ ముందంజలో కొనసాగుతోంది.
Read Also: పాక్‌ను ఉతికారేసిన యువ భారత్..
Follow Us On: Sharechat


