హిందూపురంలో ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పర్యటన

కలం, వెబ్ డెస్క్ : హిందూపురం (Hindupur) నియోజకవర్గ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) ఇవాళ్టి నుంచి రెండు రోజుల పాటు నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా గ్రామీణ ప్రాంతాల్లో రహదారుల నిర్మాణం, తాగునీటి సదుపాయాల మెరుగుదల, డ్రైనేజ్ వ్యవస్థల అభివృద్ధి, విద్యా, వైద్య రంగాలకు సంబంధించిన పనులకు శంకుస్థాపనలు చేయనున్నారు.

స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, అధికారులు ఈ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. అలాగే పలు గ్రామాల్లో ప్రజల సమస్యలను తెలుసుకుని పరిష్కార చర్యలపై అధికారులతో సమీక్ష సమావేశాలు నిర్వహించనున్నట్లు సమాచారం. అభివృద్ధి కార్యక్రమాల వేగవంతమైన అమలుకు కట్టుబడి ఉన్నామని ఎమ్మెల్యే బాలకృష్ణ (Nandamuri Balakrishna) పేర్కొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>