Mobile Popup Ad
Mobile Popup Ad

తొర్రూరు మున్సిపాలిటీ లక్కీ డ్రాలో మోసం.. బీఆర్ఎస్ సంచ‌ల‌న ఆరోప‌ణ‌!

క‌లం, వెబ్ డెస్క్‌: తొర్రూరు మున్సిపాలిటీ (Thorrur Municipality) లక్కీ డ్రాలో భారీ మోసం జ‌రిగిందంటూ బీఆర్ఎస్(BRS) పార్టీ సంచ‌ల‌న ఆరోప‌ణ చేసింది. కాంగ్రెస్ (Congress) పార్టీ అభ్య‌ర్థి గెలిచేందుకు అధికారులు చిట్టీల మ‌డ‌త‌లో మోసానికి పాల్ప‌డ్డార‌ని గులాబీ నేత‌లు ఆరోపిస్తున్నారు. లక్కీ డ్రాలో బీఆర్ఎస్ అభ్యర్థికి చెందిన‌ ఐదు చిట్టీలు సన్నగా మలిచి, కాంగ్రెస్ అభ్యర్థికి చెందిన ఐదు చిట్టీలు లావుగా మలిచినట్లు చెప్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి అన్ని చోట్ల లక్కీ డ్రాలో చైర్మన్ పీఠం దక్కడం వెనుక కార‌ణం ఇదేనంటున్నారు. చిట్టీల ఎన్నిక‌లో వెతికి మరీ కాంగ్రెస్‌కు చెందిన‌ లావు చిట్టీ తీసి అధికారులు అధికార‌ పార్టీకి అనుకూలంగా వ్యవహరించార‌ని చెప్తున్నారు. చైర్మన్, వైస్ చైర్మన్ రెండు కాంగ్రెస్ పార్టీకే దక్కేలా కుట్ర చేయడానికే ఒక రోజు ఎన్నిక వాయిదా వేశార‌ని పేర్కొంటూ సోష‌ల్ మీడియాలో వీడియోలు షేర్ చేస్తున్నారు. ఈ ల‌క్కీ డ్రాల‌కు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Read Also: రైతులకేదీ భరోసా?.. సాయం కోసం ఎదురుచూపులు

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>