ఉద్యోగాల్లో స్థానికులకే ప్రాధాన్యం ఇవ్వాలి: ఎమ్మెల్యే నాయిని

కలం, హనుమకొండ: కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఉద్యోగాల్లో స్థానిక యువతకే తొలి ప్రాధాన్యం కల్పించాలని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి (Naini Rajender Reddy) డిమాండ్ చేశారు. రైల్వే జేఏసీ, వివిధ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో మడికొండ నుంచి కాజీపేట రైల్వే జంక్షన్ వరకు నిర్వహించిన పాదయాత్రలో నాయిని పాల్గొని ఉద్యమానికి సంఘీభావం ప్రకటించారు.

నైపుణ్య శిక్షణ ఇవ్వాలి..

ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాయిని మాట్లాడుతూ.. ఎన్నో ఏళ్లుగా వరంగల్ ప్రాంత ప్రజలు ఎదురుచూస్తున్న కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ స్థానిక యువతకు ఉపాధి కేంద్రంగా మారాలని అన్నారు. ఫ్యాక్టరీలో కల్పించే సుమారు మూడు వేల ఉద్యోగాలను స్థానికులకే కేటాయించేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. ఉద్యోగాలకు అవసరమైన నైపుణ్యాల కోసం ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం తరఫున సహకారం..

ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున పూర్తి సహకారం అందిస్తామని తెలిపారు. అలాగే కోచ్ ఫ్యాక్టరీ కోసం భూములు కోల్పోయిన నిర్వాసిత కుటుంబాలకు ఉద్యోగాల్లో ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు. రైల్వే జేఏసీ నిర్ణయాలకు అన్ని రాజకీయ పార్టీలు మద్దతు ఇవ్వాలని, స్థానికుల హక్కుల సాధన కోసం ఉద్యమాన్ని ఐక్యంగా కొనసాగించాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>