కలం, భువనగిరి: భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి (MLA Kumbam) ని బీబీనగర్ మండలం మహదేవపూర్ (Mahadevpur) గ్రామ ప్రసిద్ధ వేణుగోపాల స్వామి (అక్కన్న–మాదన్న) ఆలయ పాలకవర్గ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిశారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని ఎమ్మెల్యే నివాసంలో ఈ భేటీ జరిగింది. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డిని శాలువాతో సత్కరించి, స్వామివారి ప్రసాదాన్ని అందజేశారు.
అనంతరం మహదేవపూర్ (Mahadevpur) వేణుగోపాల స్వామి ఆలయ సమగ్ర అభివృద్ధి, భక్తులకు కల్పించాల్సిన మెరుగైన మౌలిక వసతులు, సౌకర్యాల గురించి ఎమ్మెల్యేతో చర్చించారు. ఆలయ ప్రగతికి సహకారం అందించాలని ఈ సందర్భంగా వారు ఎమ్మెల్యేకు విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ కందాడి రమణమ్మ–బాల్ రెడ్డి, పాలకవర్గ సభ్యులు బాదిని ఆంజనేయులు గౌడ్, చెవుల సురేందర్ రెడ్డి, వెంగల శ్రీకాంత్ రెడ్డి, టీజీ రవి సింగ్, పచ్చిమట్ల బాలరాజ్ గౌడ్, మునిగాల సంజీవ, కో-ఆప్షన్ సభ్యులు, ఉప సర్పంచ్, వార్డు సభ్యులు గాండ్ల రమేష్, ఆలయ మాజీ చైర్మన్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Read Also: 2 లక్షల ఉద్యోగాలు.. మంత్రి శ్రీధర్ బాబు కీలక వ్యాఖ్యలు
Follow Us On: Sharechat

