గ్రామాల అభివృద్ధి ప్రభుత్వ లక్ష్యం: ఎమ్మెల్యే మేఘారెడ్డి

కలం, వనపర్తి: గ్రామాల అభివృద్ధి, ప్రజలకు మెరుగైన మౌలిక వసతుల కల్పనే కాంగ్రెస్‌ ప్రభుత్వ లక్ష్యమని వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి (MLA Megha Reddy) అన్నారు. గురువారం రేవల్లి మండలం శానాయపల్లిలో నూతన గ్రామ పంచాయతీ, మహిళా సమైక్య భవనాలను ఎమ్మెల్యే ప్రారంభించారు. శానాయపల్లిలో మిద్దె శేషమ్మ, సవాయి రేణుక కుటుంబాల ఇందిరమ్మ ఇళ్ల గృహ ప్రవేశాల్లో పాల్గొని లబ్ధిదారులకు నూతన వస్త్రాలు అందజేశారు. పెద్దమందడి మండలం అమ్మపల్లిలో నూతన గ్రామ పంచాయతీ భవనాన్ని ప్రారంభించి, మహిళా సమైక్య భవన నిర్మాణానికి భూమిపూజ చేశారు.

అనంతరం ఇందిరమ్మ ఇళ్లు పూర్తి చేసుకున్న పుట్టమాని రజిత–బాలరాజ్‌, శెట్టి జ్యోతి–బస్వరాజ్‌, ఎం.సుజాత–యాదయ్య, చిన్నగుంట రామేశ్వరమ్మ–ఆంజనేయులు, బుడగ జంగం కృష్ణవేణి–సీతారాములు కుటుంబాల గృహ ప్రవేశాల్లో ఎమ్మెల్యే పాల్గొన్నారు. వారికి నూతన వస్త్రాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. మార్కెట్‌ కమిటీ ఛైర్మన్ ఎక్కే వెంకటేష్‌, వైస్‌ ఛైర్మన్ మంద సత్య శిలారెడ్డి, మండల కాంగ్రెస్‌ నాయకులు, సర్పంచులు, మాజీ సర్పంచులు, గ్రామ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>