గుడుంబా స్థావరాలపై ఎక్సైజ్ దాడులు

కలం, నిర్మల్: దస్తురాబాద్ (Dasturabad) మండలంలోని మున్యాల తండా, ఎర్రగుంటపల్లి, రేవోజిపేట గ్రామాలతో పాటు కడెం మండలం రంగాపూర్ గ్రామంలో గుడుంబా (Gudumba) స్థావరాలపై ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారులు గురువారం విస్తృతంగా దాడులు నిర్వహించారు. ఈ దాడులలో ఐదు కేసులు నమోదు చేసి ఇద్దరిని అరెస్ట్ చేశారు. 9 లీటర్ల గుడుంబాను స్వాధీనం చేసుకున్నారు. గుడుంబా తయారీకి సిద్ధంగా ఉంచిన 1,300 లీటర్ల బెల్లం పానకాన్ని ధ్వంసం చేసినట్లు ఎక్సైజ్ సీఐ రంగస్వామి తెలిపారు. గుడుంబా తయారీ, విక్రయాలపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. దాడులలో  ఎన్‌ఫోర్స్‌మెంట్ ఇన్‌స్పెక్టర్ గంగారెడ్డి, ఎస్‌ఐలు అభిషేక్, సింధు, ఎక్సైజ్ సిబ్బంది పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>