Mobile Popup Ad
Mobile Popup Ad

కోనేరుపల్లెకు జాతీయ స్థాయిలో ప్రథమ బహుమతి

కలం, కరీంనగర్ బ్యూరో : జాతీయ స్థాయిలో ప్రథమ బహుమతి గెలుపొందిన చొప్పదండి మండలం కోనేరుపల్లె (Konerupalle) గ్రామ సర్పంచ్ కాసు వేణుగోపాల్ రాజును చొప్పదండి ఎమ్మెల్యే, కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు మేడిపల్లి సత్యం శాలువాతో ఘనంగా సత్కరించారు. భారత గ్రామీణాభివృద్ధిని వేగవంతం చేయడానికి, దేశంలోని 1.5 లక్షలకు పైగా ఉన్న గ్రామ సర్పంచులను అనుసంధానిస్తూ ఒకే వేదికపైకి తెచ్చే క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సర్పంచ్ సంవాద్ యాప్ రూపొందించింది. దీని ద్వారా మార్చి నెలలో భారత ప్రభుత్వం “క్రీడా మిత్ర పంచాయతీ ” ప్రణాళిక ఏర్పాటు చేసింది. ఇందులో భాగంగా గ్రామంలోని యువతని క్రీడలవైపు మళ్లించే విధంగా కృషిచేసి వారితో తెలంగాణ ప్రభుత్వం నిర్వహించి CM కప్ పోటీలలో పాల్గొనే విధంగా సర్పంచ్ వేణుగోపాల్ రాజు ప్రోత్సహించారు.

ఈ క్రమంలో రూపొందించిన వీడియోకు గాను కోనేరుపల్లె సర్పంచ్ దేశంలోనే మొదటి స్థానంలో నిలిచి 35 వేల రూపాయల బహుమతి గెలుచుకున్నాడు. దీంతో చొప్పదండి నియోజకవర్గంతో పాటు, కరీంనగర్ జిల్లాకు జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకొచ్చినందుకు కోనేరుపల్లె (Konerupalle) సర్పంచ్ తో పాటు ఉపసర్పంచ్ గజ్జెల తిరుపతి, పాలకవర్గ సభ్యులు, ఎంపిడిఓ వేణుగోపాల్ రావు, ఎంపివో రాజగోపాల్ రెడ్డి, కార్యదర్శి శ్రీనివాస్ లను అభినందించారు. ఈ సందర్భంగా కోనేరుపల్లె గ్రామ పాలకవర్గానికి ఎమ్మెల్యే సత్యం ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో నగర కాంగ్రెస్ అధ్యక్షులు వైద్యుల అంజన్ కుమార్, ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి, చొప్పదండి మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ఇప్ప శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Read Also: విద్యుత్ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కమిటీ వేస్తాం: భట్టి విక్రమార్క

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>