కలం, వెబ్ డెస్క్: ఆదిలాబాద్‌లోని (Adilabad) రాజీవ్ గాంధీ వైద్య విజ్ఞాన సంస్థ (రిమ్స్)లో కొందరు మెడికల్ విద్యార్థుల తీరు వివాదాస్పదంగా మారింది. రోగులకు వైద్యం అందించాల్సిన ఆస్పత్రిని రీల్స్ చిత్రీకరించే ఫిల్మ్ స్టూడియోగా మార్చేశారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. విధి నిర్వహణలో ఉండగానే నిబంధనలకు విరుద్ధంగా ఆపరేషన్ థియేటర్లలోకి వెళ్లారు. అక్కడి ఖరీదైన వైద్య యంత్రాలపై కూర్చొని విన్యాసాలు చేస్తూ వీడియోలు తీయడం విస్మయం కలిగిస్తోంది. చివరికి రోగులు చికిత్స పొందుతున్న వార్డులను కూడా వదలకుండా రీల్స్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు చేశారు. ఈ విషయమై రోగుల బంధువులు, సామాజిక కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బాధ్యతాయుతమైన వృత్తిలో ఉండి ఇలాంటి పనులకు పాల్పడటంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
Read Also: మళ్లీ టీఆర్ఎస్… కేటీఆర్ మాటల వెనుక మర్మమేమిటి?
Follow Us On: Instagram

