కలం, కరీంనగర్ బ్యూరో: కరీంనగర్ (Karimnagar) నూతన మార్కెట్ కమిటీ చైర్మన్‌గా ఎన్నికైన ఆకుల నరసయ్య (Akula Narsaiah) కు డీసీసీ అధ్యక్షుడు, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం (MLA Medipalli Satyam) అభినందనలు తెలిపారు. కరీంనగర్‌లోని ఎమ్మెల్యే నివాసంలో మేడిపల్లి సత్యంను ఆకుల నర్సయ్య మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నరసయ్య ఎమ్మెల్యేను శాలువాతో ఘనంగా సత్కరించి ఆశీస్సులు అందుకున్నారు.
తన నియామకానికి సహకరించినందుకు ఆకుల నర్సయ్య ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా మేడిపల్లి సత్యం మాట్లాడుతూ.. మార్కెట్ కమిటీ చైర్మన్‌గా రైతులకు అత్యుత్తమ సేవలు అందిస్తూ, వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. అనంతరం నూతనంగా బాధ్యతలు చేపట్టిన ఆకుల నరసయ్య భవిష్యత్తులో విజయవంతం కావాలని శుభాకాంక్షలు తెలిపారు.

