Mobile Popup Ad
Mobile Popup Ad

ఏపీకి నిధుల వరద.. తెలంగాణకు అన్యాయం : ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి

కలం, వెబ్ డెస్క్ : కేంద్ర ప్రభుత్వం(Central Govt) ఏపీకి పెద్దఎత్తున నిధులు కేటాయిస్తోందని, కానీ తెలంగాణను మాత్రం పూర్తిగా నిర్లక్ష్యం చేస్తోందని మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి (MLA Yennam Srinivas)  తీవ్రంగా విమర్శించారు. ఆయన మాట్లాడుతూ, ఎక్కువ మంది ఎంపీలను గెలిపించిన తెలంగాణకు కేంద్రం సవతి తల్లి ప్రేమ చూపిస్తోందని ఆరోపించారు. ప్రారంభం నుంచే తెలంగాణపై కేంద్ర వైఖరి అన్యాయంగా ఉందని పేర్కొన్నారు. అమరావతి నిర్మాణానికి కేంద్రం వేల కోట్ల రూపాయలు ఇస్తోందని, కానీ తెలంగాణలోని భారత్ ఫ్యూచర్ సిటీకి మాత్రం ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదని ఆయన విమర్శించారు. బీజేపీ–బీఆర్ఎస్ సంబంధాలపై వ్యాఖ్యానిస్తూ, ‘ఫెవికాల్ కంటే బలమైన బంధం వారిద్దరిది’ అని ఎద్దేవా చేశారు. బీజేపీ, బీఆర్ఎస్ సహకారంతో అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తున్నట్లు ఆయన ఆరోపించారు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయ వర్గాలలో  చర్చనీయాంశంగా మారాయి.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>