కలం, వెబ్ డెస్క్ : తెలంగాణలో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. హైదరాబాద్, కామారెడ్డి, మేడ్చల్–మల్కాజిగిరి, మెదక్ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఆయా ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు (Rain Alert ) పడే ఛాన్స్ ఉందని పేర్కొంది.
అలాగే, ములుగు, నల్గొండ, నారాయణపేట, సంగారెడ్డి, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల్లోనూ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. వర్షాలు కురిసే సమయంలో గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు.
ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాల సమయంలో అవసరమైతే తప్ప బయటకు వెళ్లకపోవడం మంచిదని అధికారులు సూచిస్తున్నారు.

