పార్టీ మార్పుపై మల్లారెడ్డి రియాక్షన్ ఇదే!

కలం, వెబ్ డెస్క్: మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి (Malla Reddy) పార్టీ మారుతున్నారంటూ గత కొద్దిరోజులుగా వార్తలు చక్కర్లు కొడుతున్న విషయం తెలిసిందే. ఈ విషయమై స్వయంగా మల్లారెడ్డి స్పందించారు. తాను పార్టీ మారుతున్నట్లు జరుగుతున్న ప్రచారంలో ఏమాత్రం నిజం లేదని, తాను బీఆర్ఎస్‌లోనే (BRS) కొనసాగుతున్నానని ఆయన స్పష్టం చేశారు. ఇటీవల తాను ప్రధానమంత్రిని కలిసిన విషయాన్ని ప్రస్తావించారు. ప్రధానిని కలిసినంత మాత్రాన పార్టీ మారినట్లు ఎలా అవుతుందని ఆయన ప్రశ్నించారు.

సోషల్ మీడియాలో తనపై వస్తున్న అసత్య ప్రచారాలను నమ్మవద్దని, అలాంటి ఊహాగానాలకు తాను సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని ఆయన తేల్చి చెప్పారు. తన రాజకీయ ప్రయాణంపై వస్తున్న వార్తలు కేవలం దుష్ప్రచారమేనని మల్లారెడ్డి కొట్టిపారేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>