కలం, మెదక్ బ్యూరో: సంగారెడ్డి (Sangareddy) జిల్లా గుమ్మడిదల మున్సిపాలిటీ (Gummadidala Municipality) లో పలు అభివృద్ది పనులకు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి (Mahipal Reddy ) శంకుస్థాపన చేశారు. అన్నారం గ్రామంలోని 4వ వార్డులో ప్రకృతివనం కాలనీల ప్రధాన రహదారికి రూ.72 లక్షల 50 వేల నిధులతో CC రోడ్డు నిర్మాణ పనులను చేపట్టనున్నారు. ఈ నిర్మాణ పనులకు పటాన్ చెరువు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి శంకుస్థాపన చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతీ మున్సిపాలిటీకి అభివృద్ధి కోసం రూ. 15 వేల కోట్లు కేటాయించిందని తెలిపారు. ఆ నిధులతోనే వార్డులలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ దశరథ్, చైర్మన్ కుమార్ గౌడ్, మాజీ సర్పంచ్ గోకర్ జయశంకర్ గౌడ్, చీమ్ముల గోవర్ధన్ రెడ్డి, గుమ్మడిదల మున్సిపాలిటీ కౌన్సిలర్లు పాల్గొన్నారు.

