Mobile Popup Ad
Mobile Popup Ad

కల్వర్టు నిర్మాణ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి

కలం, మెదక్ బ్యూరో : దుబ్బాక నియోజకవర్గ పరిధిలోని నాగ్ పూర్ జాతీయ రహదారి 44 (NH-44) పై కొనసాగుతున్న కల్వర్టు నిర్మాణ పనులను దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి (Kotha Prabhakar Reddy) పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. జాతీయ రహదారిపై వర్షాకాలంలో రహదారిపై నీరు నిల్వ ఉండడం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశాలు పెరుగుతున్నాయన్నారు. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారంగా ఆధునిక సాంకేతిక ప్రమాణాలతో కల్వర్టు నిర్మాణ పనులు చేపడుతున్నట్లు ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి తెలిపారు.

పనుల నిర్వహణలో ఎలాంటి నిర్లక్ష్యం చోటుచేసుకోకుండా, నిర్మాణ పనులు నాణ్యతతో పాటు నిర్దేశిత గడువులోపు పూర్తి చేయాలని అధికారులకు ఎమ్మెల్యే (Kotha Prabhakar Reddy) ఆదేశించారు. ప్రజల భద్రత దృష్ట్యా పనులు జరుగుతున్న ప్రాంతాల్లో హెచ్చరిక బోర్డులు, రక్షణ చర్యలు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని సూచించారు. దుబ్బాక నియోజకవర్గంలో రహదారి సదుపాయాలు కల్పించడం ద్వారా అన్ని రంగాల్లో ముందంజలో నిలిపేందుకు కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి తెలిపారు.

Read Also: న‌న్ను ఆయ‌న చెప్పుతో కొట్టాడు.. సంచ‌ల‌న విష‌యాలు వెల్ల‌డించిన‌ బండ్ల గ‌ణేష్!

Read Also: ఆమెకు రక్షణేది..?

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>