కలం, వెబ్ డెస్క్: ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ (Bandla Ganesh) ఒక ఇంటర్వ్యూలో తన జీవితానికి సంబంధించిన ఒక షాకింగ్ సంఘటనను షేర్ చేసుకున్నారు. టాలీవుడ్ ప్రముఖ నటి సౌందర్య హెలికాఫ్టర్ ప్రమాదంలో చనిపోయినప్పుడు జరిగిన ఈ ఘటన అందరినీ షాక్‌కు గురి చేస్తోంది. సౌందర్య చనిపోయినప్పుడు తాను ఇండస్ట్రీకి చెందిన ఒక పెద్ద మనిషి దగ్గరికెళ్లి కూర్చుంటే, ఆయన తనను చెప్పుతో కొట్టినట్లు బండ్ల వెల్లడించారు. ఆ సంఘటనను తాను జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేనన్నారు. కానీ, ఒక రకంగా ఆయన కొట్టిన ఆ చెప్పు దెబ్బే తన జీవితాన్ని పూర్తిగా మార్చేసిందంటూ బండ్ల గణేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఆ తర్వాత జరిగిన పరిణామాలను కూడా ఆయన వివరించారు. తనను చెప్పుతో కొట్టిన సదరు పెద్ద మనిషి, ఆ ఘటన జరిగిన రెండు రోజుల తర్వాత స్వయంగా తన దగ్గరకు వచ్చి క్షమాపణ చెప్పారని బండ్ల గణేష్ (Bandla Ganesh) వెల్లడించారు. అయితే ప్రస్తుతం ఆ వ్యక్తి ఇండస్ట్రీలో చాలా పెద్ద స్థానంలో ఉన్నారని, అందుకే ఇప్పుడు ఆయన పేరు బయటకు చెప్తే బాగుండదంటూ సదరు వ్యక్తి పేరును వెల్లడించడానికి ఆయన నిరాకరించారు. బండ్ల గణేష్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సినీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఇంతకీ ఆ పెద్ద మనిషి ఎవరై ఉంటారా? అని సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది.
Read Also: అవకాశం వస్తే ఆయన పక్కన హీరోయిన్‌గా చేస్తా: రోజా
Follow Us On: Instagram

