కలం, చండూరు: చేనేత కార్మికుల సమస్యలపై తనకు పూర్తి అవగాహన ఉందని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (Komatireddy Rajagopal Reddy) అన్నారు. మునుగోడు చేనేత సహకార సంఘం ఉత్పత్తి క్రయవిక్రయ సంఘం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఎమ్మెల్యే హాజరై నూతన పాలకవర్గ సభ్యులకు అభినందనలు తెలిపారు. మునుగోడు నియోజకవర్గం చేనేత పనికి, నేత కార్మికులకు పెట్టింది పేరని తెలిపారు.
మర మగ్గాలు వచ్చాక..
మర మగ్గాలు వచ్చిన తర్వాత కార్మికుల జీవనాలు అస్తవ్యస్తంగా తయారయ్యాయని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వివరించారు. పని దొరకడం లేదని.. దొరికిన పనికి సరైన ఉపాధి రావట్లేదని ఆవేదన చెందారు.
తాను రాజకీయాలలోకి రాక ముందే వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నేత కార్మికులకు రుణమాఫీ చేయించానని రాజగోపాల్ రెడ్డి (Rajagopal Reddy ) గుర్తు చేశారు. నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న చేనేత సహకార సంఘాల పాలకవర్గ సభ్యులతో మాట్లాడి వారి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేలా చూస్తానని హామీ ఇచ్చారు.
Read Also: పోచంపల్లికి ప్రపంచ స్థాయి గుర్తింపు: ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి
Follow Us On: Instagram

