హైడ్రా కమిషనర్ పై హైకోర్టు సీరియస్

కలం, వెబ్ డెస్క్ : హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ పై తెలంగాణ హైకోర్టు (Telangana High Court) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఓ కేసులో హైడ్రా (HYDRAA) జోక్యం చేసుకోవడంతో కమిషనర్ రంగనాథ్ కోర్టు ఎదుట హాజరు కావాలని న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. దీంతో హైడ్రా కమిషనర్ సోమవారం హైకోర్డు ఎదుట హాజరయ్యారు. విచారణ సందర్భంగా న్యాయస్థానం రంగనాథ్ తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

కోర్టులో హాజరు కావాలని రంగనాథ్ కు న్యాయస్థానం ఆదేశించడంతో సోమవారం విచారణకు హాజరయ్యారు.  కోర్టు జారీ చేసిన ఉత్తర్వులు అమలు చేయకపోవడంపై కమిషనర్ పై న్యాయమూర్తి సీరియస్ అయ్యారు. కాగా, పలుసార్లు హైడ్రా (HYDRAA) తీరుపై హెకోర్టు అసంతృప్తి వ్యక్తం చేస్తూ మొట్టికాయలు వేసింది. ఈ క్రమంలో కమిషనర్ రంగనాథ్ (AV Ranganath) స్వయంగా కోర్టు విచారణకు రావడం చర్చనీయాంశంగా మారింది.

Read Also: ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి సూసైడ్ నోట్‌లో సంచలన విషయాలు

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>