నిమజ్జన ఏర్పాట్లపై ఎమ్మెల్యే కవ్వంపల్లి కీలక ఆదేశాలు

కలం, కరీంనగర్: కరీంనగర్ జిల్లా మానకొండూర్ చెరువు వద్ద వినాయక నిమజ్జనానికి సంబంధించిన ఏర్పాట్లను తక్షణమే పూర్తి చేసి, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ (MLA Kavvampally) సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం మానకొండూర్ చెరువు వద్ద వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి నిమజ్జన ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. అనంతరం గ్రామ పంచాయతీ కార్యాలయంలో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కరీంనగర్‌తో పాటు మానకొండూర్ (Manakondur) చుట్టుపక్కల గ్రామాల్లో ప్రతిష్టించిన వినాయక విగ్రహాలను నిమజ్జనం చేసేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు మానకొండూర్ చెరువుకు వచ్చే అవకాశం ఉందన్నారు. ఈ నేపథ్యంలో నిమజ్జన కార్యక్రమానికి అవసరమైన అన్ని ఏర్పాట్లను ముందుగానే పూర్తి చేయాలని సూచించారు. నిమజ్జనం సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పకడ్బందీగా భద్రతా చర్యలు చేపట్టాలని కవ్వంపల్లి ఆదేశించారు.

చెరువు పరిసరాల్లో కాంతివంతమైన విద్యుత్ దీపాలు ఏర్పాటు చేయడంతోపాటు, భారీ విగ్రహాలను నిమజ్జనం చేసేందుకు అవసరమైన క్రేన్లను అందుబాటులో ఉంచాలని సూచించారు. గజ ఈతగాళ్లను కూడా ముందస్తుగా సిద్ధంగా ఉంచాలని తెలిపారు. భక్తులు, వాహనాల రాకపోకలతో ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా అవసరమైన చోట వాహనాలను దారి మళ్లించాలని పోలీసు అధికారులకు సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో తక్షణ వైద్య సేవలు అందించేందుకు వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయాలని ఆయన (MLA Kavvampally) తెలిపారు. రెవెన్యూ, పోలీసు, ఫైర్, విద్యుత్, ఇరిగేషన్, మున్సిపల్, వైద్య ఆరోగ్య తదితర శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి నిమజ్జన కార్యక్రమాన్ని ప్రశాంతంగా, సురక్షితంగా నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే కవ్వంపల్లి కోరారు.

ఈ సమావేశంలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ బండి రాజేశ్వరి, ఎంపీడీవో వీవీ వరలక్ష్మి, తహసీల్దార్ విజయ్ కుమార్, గ్రామ సర్పంచ్ తాళ్లపల్లి వర్షిణీ, ఎంపీవో సంతోష్ రావు, సీఐ శ్రీలత, మాజీ జడ్పీటీసీ తాళ్లపల్లి శేఖర్ గౌడ్, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ద్యావ శ్రీనివాస్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ కమిటీ ఉపాధ్యక్షుడు నందగిరి రవీంద్రచారి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు తాళ్లపల్లి సంపత్ గౌడ్, నాయకులు ముద్దసాని శ్రీనివాస్ రెడ్డి, లక్ష్మారెడ్డి, పార్టీ నాయకులు మర్రి ఓదెలు యాదవ్, రామిడి తిరుమల్ రెడ్డి, రేమిడి శ్రీనివాస్ రెడ్డి, రేవెల్లి రాజలింగం, కిషన్ రావు, బుర్ర శ్రీధర్ గౌడ్, రామడుగు హరీష్, మీస సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

Also Read : గోల్స్ వర్షం.. రికార్డు మ్యాచ్‌తో భారత్ జోరు!

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>