ఆరోగ్యంగానే ఉన్నా.. ఆందోళన వద్దు: ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి

కలం మెదక్ బ్యూరో : తాను ఆరోగ్యంగానే ఉన్నానని.. ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పటాన్ చెరువు (Patancheruvu) ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి (MLA Gudem Mahipal Reddy) ప్రకటన విడుదల చేశారు. మంగళవారం సాయంత్రం హైదరాబాదులోని తన కార్యాలయంలో బాత్రూం నుంచి వచ్చే సమయంలో కాలుజారి పడటం మూలంగా స్వల్పంగా గాయపడ్డట్లు పేర్కొన్నారు. వైద్య పరీక్షల అనంతరం.. వారం రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించినట్లు తెలిపారు. కార్యకర్తలు, నాయకులు, అభిమానులు ఆందోళన చెందవద్దని విజ్ఞప్తి చేశారు. భగవంతుడి కృపతో.. పటాన్ చెరువు నియోజకవర్గ ప్రజల ఆశీస్సులతో, కార్యకర్తల అభిమానంతో అతి త్వరలో ప్రజాసేవలోకి రానున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు.

Read Also: హైకోర్టు తీర్పు కాంగ్రెస్ కుట్రలకు చెంపపెట్టు: కేటీఆర్

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>