రెండో విడత ఇందిరమ్మ ఇండ్లు త్వరలో మంజూరు చేస్తాం: పొంగులేటి

కలం, ఖమ్మం బ్యూరో: పేదల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లు (Indiramma Indlu) పంపిణీ చేస్తున్న విషయం తెలిసిందే. రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల పంపిణీ త్వరలో ప్రారంభమవుతుందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి (Ponguleti Srinivasa Reddy) తెలిపారు. బుధవారం ఆయన ఖమ్మం జిల్లాలో పర్యటించి ఇందిరమ్మ ఇండ్ల గురించి మాట్లాడారు. ఏదులాపురం మున్సిపాలిటీలో చింతపల్లి నుంచి ముత్తగూడెం వరకు రూ.6.5 కోట్ల వ్యయంతో చేపట్టిన బీటీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. బీటీ రోడ్డు నిర్మాణ పనులను రాబోయే వర్షాకాలానికి ముందే పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. పనులు నాణ్యతతో పూర్తి చేయాలని, స్థానికులు కూడా పర్యవేక్షణలో భాగస్వాములు కావాలని సూచించారు.

ముత్తగూడెంకు ఇప్పటివరకూ అంతర్గత సీసీ రోడ్లు, డ్రైన్లు, లింకు రోడ్ల అభివృద్ధికి కలిపి రూ.16 కోట్ల 70 లక్షలు మంజూరు చేసినట్లు మంత్రి తెలిపారు. ఏదులాపురం మున్సిపాలిటీని (Yedulapuram Municipality) రాష్ట్రంలో ఆదర్శవంతంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. గ్రామాలు, పట్టణాల అభివృద్ధితోపాటు పేదల సంక్షేమ పథకాల అమలులో ఎక్కడా నిర్లక్ష్యం ఉండదని స్పష్టం చేశారు. ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలో మరిన్ని సీసీ రోడ్లు, డ్రైన్లు నిర్మించాల్సిన అవసరం ఉందని, త్వరలోనే వీటిని చేపట్టి పూర్తి చేస్తామన్నారు.

Read Also: ఆరోగ్యంగానే ఉన్నా.. ఆందోళన వద్దు: ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>