జోగిపేట్‌లో గ్యాస్ కొరత.. వినియోగదారుల ధర్నా

కలం, మెదక్ బ్యూరో : సంగారెడ్డి (Sangareddy)  జిల్లా జోగిపేట్ (Jogipet) పట్టణంలో గ్యాస్ సరఫరా సమస్య (Gas Shortage) తీవ్రరూపం దాల్చింది. గ్యాస్ అందక ఇబ్బందులు పడుతున్న వినియోగదారులు స్థానిక స్పందన ఇండియన్ గ్యాస్ కార్యాలయం ఎదుట ధర్నాకు దిగారు. గ్యాస్ బుకింగ్ చేయడం కష్టమవుతోందని, బుకింగ్ చేసినప్పటికీ సిలిండర్‌లు సమయానికి అందడం లేదని వినియోగదారులు ఆవేదన వ్యక్తం చేశారు. గత రెండు రోజులుగా గ్యాస్ లారీలు రాకపోవడంతో సమస్య మరింత తీవ్రమైందని తెలిపారు.

ఇదిలా ఉండగా, గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులు సరఫరా కొరత కారణంగానే ఈ పరిస్థితి ఏర్పడిందని చెప్పారు. సరిపడా స్టాక్ లేకపోవడంతో సిలిండర్లను సమయానికి అందించడం కష్టమవుతోందని వెల్లడించారు. ఈ సమస్యపై అధికారులు వెంటనే స్పందించి గ్యాస్ సరఫరాను పెంచాలని వినియోగదారులు డిమాండ్ చేశారు. సమస్యను (Gas Shortage) పరిష్కరించకపోతే పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. జోగిపేట్ సీఐ అనిల్ కుమార్, ఎస్‌ఐ దుర్గయ్యలు వినియోగదారులతో మాట్లాడి వారిని శాంతింపజేసి అక్కడి నుంచి పంపించారు.

Read Also: ఆరోగ్యంగానే ఉన్నా.. ఆందోళన వద్దు: ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>