కలం, నిజామాబాద్ బ్యూరో: ఇందూరు నగరంలోని జెండా బాలాజీ ఆలయంలో శనివారం నిర్వహించిన జెండా జాతరలో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ (Dhanpal Suryanarayana) పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఇందూరులో ఏళ్లుగా భాద్రపద మాసంలో వినాయకచవితికి ముందు జెండా జాతర ప్రారంభం అవుతుందన్నారు. జెండా ఆలయం నుంచి శోభాయాత్రగా పులాంగ్ వరకు కొనసాగి, అక్కడ వారం రోజులపాటు ఉంటుందన్నారు. ప్రతి ఒక్కరు దర్శించుకొని వేంకటేశ్వర స్వామి కృపా కటక్షాలు పొందాలన్నారు. బీజేపీ కార్పొరేటర్లు నాగోల్ల లక్ష్మీనారాయణ, పసునూరి రాము, మల్కాయి మహేందర్, ప్రసూన శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు.

