కలం, నిజామాబాద్ బ్యూరో: జనగణన 2027లో భాగంగా నిజామాబాద్ (Nizamabad) అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా (MLA Dhanpal) స్వీయ నమోదు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆదివారం నగరంలోని తన నివాసంలో జనగణన పోర్టల్ ద్వారా సంబంధిత అధికారులు స్వీయ నమోదు వివరాలు, ప్రాముఖ్యతను వివరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ జనగణనలో పాల్గొనాలని, స్వీయ నమోదు చేసుకోవాలని పిలుపునిచ్చారు.
ఎటువంటి అపోహలకు తావు ఇవ్వకుండా ప్రభుత్వ అధికారిక పోర్టల్‌లో తమ వివరాలను పొందుపరచాలని సూచించారు. అధికారులు ఇంటింటికి తిరిగి వివరాలు సేకరిస్తారని, అలాగే ప్రజలు కూడా స్వయంగా ఆన్లైన్ ద్వారా నమోదు చేసుకునే అవకాశం ఉందన్నారు. కార్యక్రమంలో కార్పొరేషన్ డిప్యూటీ కమిషనర్, తహశీల్దార్ బాలరాజు, టీపీఓ ప్రదీప్ తదితరులు పాల్గొన్నారు.
Read Also: కవిత వ్యాఖ్యలకు కేసీఆర్ రియాక్షన్‌పై ఉత్కంఠ
Follow Us On : WhatsApp

