కలం, నల్లగొండ : బస్సు ఆపలేదనే కోపంతో ఓ ప్రయాణికుడు చేసిన దాడిలో ఆర్టీసీ డ్రైవర్ గాయాలపాలయ్యారు. ఈ ఘటన (RTC Driver Injured) నల్లగొండ జిల్లా కేంద్రంలో కలకలం రేపింది. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నల్లగొండ (Nalgonda) డిపోకు చెందిన పల్లె వెలుగు బస్సు ఆదివారం నల్లగొండ నుంచి దిల్‌సుఖ్‌నగర్‌కు వెళుతుంది. అయితే నల్లగొండ బస్టాండ్ నుంచి బయలుదేరిన కొద్దిసేపటికే ఐటీ టవర్ సమీపం చేరుకోగానే మార్గమధ్యలో ఓ ప్రయాణికుడు బస్సును ఆపమని కోరాడు. అయితే డ్రైవర్ బస్సును ఆపకుండా వెళ్లిపోయాడు.
దీంతో సదరు ప్రయాణికుడు ఆగ్రహించి బస్సును బైక్‌పై వెంబడించి ఆపాడు. ఆగ్రహంతో ఊగిపోయిన సదరు వ్యక్తి.. ఆర్టీసీ బస్సు డ్రైవర్ రామ్ కుమార్‌ను బస్సు నుంచి కిందకు లాగి రోడ్డుపై పడేసి పిడిగుద్దుల వర్షం కురిపించాడు. ఊహించని ఈ దాడిలో డ్రైవర్ రామ్ కుమార్‌కు స్వల్ప గాయాలయ్యాయి (RTC Driver Injured). పక్కనే ఉన్న ప్రయాణికులు, స్థానికులు ఆపే ప్రయత్నం చేసినా సదరు వ్యక్తి వెనక్కి తగ్గలేదు. ఈ ఘటనపై బాధితుడు రామ్ కుమార్ నల్లగొండ టూటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో విధి నిర్వహణలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగిపై దాడి చేయడంపై పోలీసులు నిందితుడిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.
– నల్గొండలో బస్సు డ్రైవర్‌పై దాడి
-బస్సు ఆపలేదని పిడిగుద్దులతో దాడి చేసిన ప్రయాణికుడు
– పోలీసులకు ఫిర్యాదు చేసిన బస్సు డ్రైవర్
Assault on RTC Bus Driver in Nalgonda: Man Attacks Driver for Not Stopping Bus#Nalgonda #RTCDriverAssault #TGSRTC #Kalam #KalamDaily #KalamTelugu pic.twitter.com/F4B8EaVduD— Kalam Daily (@kalamtelugu) April 26, 2026
Read Also: పైడిపల్లిలో ఆర్టీసీ కార్మికుల సంబురాలు
Follow Us On: X(Twitter)

