Mobile Popup Ad
Mobile Popup Ad

మహిళా బిల్లును కాంగ్రెస్ అడ్డుకోవడం చారిత్రక తప్పిదం: రఘునందన్ రావు

కలం, వెబ్ డెస్క్: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీసుకువచ్చిన మహిళా రిజర్వేషన్ బిల్లుపై కాంగ్రెస్ వైఖరిపై బీజేపీ నేత, ఎంపీ రఘునందన్ రావు (Raghunandan Rao) ఘాటు వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి మహిళా బిల్లుపై కనీస అవగాహన లేదని మండిపడ్డారు. బిల్లును కాంగ్రెస్ అడ్డుకోవడం చారిత్రక తప్పిదమని పేర్కొన్నారు. 131వ రాజ్యాంగ సవరణ వీగి పోవడంతో దేశంలోని మహిళలకు, దక్షిణాది రాష్ట్రాలకు తీరని నష్టం జరుగుతోందని చెప్పారు. మహిళా రిజర్వేషన్లపై కాంగ్రెస్, ప్రతిపక్షాల ద్వంద్వ వైఖరి ప్రదర్శిస్తున్నాయని ఆయన మండిపడ్డారు. దళితులు, గిరిజనులకు అన్యాయం చేసేలా విపక్షాల తీరు ఉందని ఫైర్ అయ్యారు.

Read Also: నల్లగొండలో దారుణం.. బస్సు ఆపలేదని ఆర్టీసీ డ్రైవర్‌పై దాడి

Follow Us On: Sharechat

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>