కలం, స్పోర్ట్స్ : భారత యువ స్క్వాష్ క్రీడాకారిణి అనహత్ సింగ్ (Anahat Singh) అరుదైన ఘనత సాధించింది. ప్రపంచ జూనియర్ స్క్వాష్ ఛాంపియన్‌షిప్ (World Junior Squash Championship) టైటిల్‌ను గెలుచుకుని చరిత్ర సృష్టించింది. ఫైనల్ పోరులో ఈజిప్ట్‌కు చెందిన రుఖయ్యా సలేమ్‌ను(Ruqayya Salem) ఓడించిన అనహత్ సింగ్.. ప్రపంచ జూనియర్ స్క్వాష్ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణ పతకం సాధించిన తొలి భారత క్రీడాకారిణిగా రికార్డు నెలకొల్పింది. అద్భుత ప్రదర్శనతో భారత స్క్వాష్ చరిత్రలో కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టింది. గతంలో 2005లో జోష్నా చిన్నప్ప ఫైనల్‌కు చేరుకుని రన్నరప్‌గా నిలిచినప్పటికీ, టైటిల్ సాధించిన తొలి భారత క్రీడాకారిణిగా అనహత్ సింగ్ నిలిచింది. ఈ విజయంతో భారత క్రీడాభిమానులలో ఆనందం వెల్లివిరిసింది.

