వర్షాలతో ఇబ్బందులు రావొద్దు.. అధికారులకు ఎమ్మెల్యే ఆదేశాలు

కలం, నిజామాబాద్ బ్యూరో: గత రెండు రోజులుగా నిజామాబాద్​లో కురుస్తున్న వర్షాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ (MLA Dhanpal Suryanarayana) సూచించారు. నగరవాసులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని కార్పొరేషన్ అధికారులు, సిబ్బందిని ఆదేశించారు. ప్రధానంగా శానిటేషన్ సిబ్బంది ఎప్పటికప్పుడు డ్రైనేజీలను శుభ్రపరచాలన్నారు. లోతట్టు ప్రాంతాల్లో నీరు నిండకుండా తగు చర్యలు తీసుకోవాలని సూచించారు.

మున్సిపల్ కమిషనర్, ఉన్నతాధికారులతో పాటు సంబంధిత విభాగాధిపతులు సిబ్బందితో సమాచారం తెలుసుకుంటూ ముందుకెళ్లాలని చెప్పారు. నాలాలు సరిగా లేనిచోట ముంపు సమస్య తలెత్తకుండా చూడాలని ఆదేశించారు. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని అందరూ అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. నగరంలోని ప్రధాన కూడళ్లలో వర్షపు నీరు చేరి ఇబ్బందులు కలగకుండా చూడాలన్నారు. అధిక వర్షపాతం నమోదైనప్పుడు నాలాలు వెంటనే శుభ్రం చేయాలన్నారు. నీరు నిండిన చోట తోడేందుకు భారీ మోటార్లు అందుబాటులో పెట్టుకోవాలని, అవసరమైతే ప్రత్యేక బృందాన్ని సిద్ధంగా ఉంచాలని చెప్పారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>