ఆగస్టు 3లోపు ‘SIR’ పూర్తి చేయాలి.. కాంగ్రెస్ బీఎల్ఏలకు ఆదేశాలు

కలం, నిర్మల్: ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ (SIR Process) పూర్తి చేసేందుకు మరో నాలుగు రోజులే గడువు ఉన్న నేపథ్యంలో ఆగస్టు 3వ తేదీలోపు వందశాతం పూర్తి చేసేందుకు కాంగ్రెస్ పార్టీ బీఎల్ఏలు కృషి చేయాలని ఆదిలాబాద్ పార్లమెంట్ SIR ఇంచార్జి, మాజీ ఎమ్మెల్యే ఆరేపల్లి మోహన్, నియోజకవర్గ కోఆర్డినేటర్, రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్ పిలుపునిచ్చారు.

గురువారం నిర్మల్ (Nirmal) జిల్లా కేంద్రంలో నిర్మల్ నియోజకవర్గానికి చెందిన బీఎల్ఏలతో సమావేశం నిర్వహించారు. జిల్లాలోని ముధోల్, ఖానాపూర్ నియోజకవర్గాల్లో SIR ప్రక్రియ 100 శాతం పూర్తైందని, నిర్మల్ నియోజకవర్గం కూడా అదే స్థాయిలో పూర్తి చేసేలా బీఎల్ఏలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.

వచ్చే నెల ఆగస్టు 12, 13 తేదీల్లో డ్రాఫ్ట్ డిక్లరేషన్ ఉంటుందని తెలిపారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నిర్మల్ నియోజకవర్గ ఇంచార్జి కూచాడి శ్రీహరి రావు, పీసీసీ ప్రధాన కార్యదర్శి ఎంబడి రాజేశ్వర్, నిర్మల్, సారంగాపూర్ మార్కెట్ కమిటీ చైర్మన్లు భీంరెడ్డి, అబ్దుల్ హదీల్, ఆయా మండలాల కాంగ్రెస్ అధ్యక్షులు, బీఎల్ఏలు పాల్గొన్నారు.

Read Also: అంగన్వాడీ ఉద్యోగాల భర్తీపై మంత్రి సీతక్క కీలక ఆదేశాలు

Follow Us On: Sharechat

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>