రాజ‌కీయాల‌కు అతీతంగా అభివృద్ధి జ‌ర‌గాలి: ఎమ్మెల్యే చింత ప్ర‌భాక‌ర్

క‌లం, మెద‌క్ బ్యూరో: రాజకీయాలకు అతీతంగా సదాశివ‌పేట‌ పట్టణ అభివృద్ధి కోసం అందరూ కలిసి పనిచేయాలని, పంతాలకు, పట్టింపులకు పోకుండా అభివృద్ధి పనులు పూర్తి చేయాలని ఎమ్మెల్యే చింత ప్రభాకర్ (MLA Chinta Prabhakar) సూచించారు. సంగారెడ్డి జిల్లా సదాశివపేట మున్సిపాలిటీలో TUFIDC కింద రూ. 12 కోట్ల 80 లక్షల అభివృద్ధి పనులను TGIIC చైర్ పర్సన్ నిర్మలా జగ్గారెడ్డితో కలిసి ఎమ్మెల్యే ప్రభాకర్ శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే (MLA Prabhakar) మాట్ల‌ాడుతూ.. అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ అని అన్నారు. SDF నిధుల‌తో చేసే కొన్ని ప‌నులు రద్దు అయ్యాయని, ఆ పనులను కూడా తిరిగి నిధులు మంజూరు చేసి అభివృద్ధి కొన‌సాగించాలని స్పష్టం చేశారు. ఇప్ప‌టికే మూడు సార్లు టెండర్లు పూర్తయినప్పటికీ కాంట్రాక్టర్లు ముందుకు రాకపోవడంతో పనులు నిలిచిపోయాయని గుర్తు చేశారు. ఈ సారి పనులు నాణ్యతతో, వేగంగా పూర్తి అయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా కాంట్రాక్టర్లు స‌కాలంలో పనులు పూర్తి చేయాలని సూచించారు.

Read Also: సిట్ విచారణకు బండి భగీరథ్ డుమ్మా.. అదే కారణమా!

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>