మహిళల భద్రత విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదు: బీర్ల ఐలయ్య

కలం, వెబ్‌డెస్క్: మహిళల భద్రత, ఆత్మగౌరవం విషయంలో ప్రజా ప్రభుత్వం రాజీపడే ప్రసక్తే లేదని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య (Beerla Ilaiah) స్పష్టం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న కేంద్ర మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) కొడుకు బండి భగీరథ్ (Bandi Bhageerath) కేసుపై ఘాటుగా స్పందించారు. రాష్ట్రంలో చిన్న విషయం జరిగినా ప్రజా ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించే బండి సంజయ్.. తన కుమారుడి విషయంలో ఎందుకు నోరు మెదపడం లేదని ఐలయ్య ప్రశ్నించారు.

పక్షపాత ధోరణి పక్కన పెట్టి బండి సంజయ్ పోలీసులకు పూర్తిగా సహకరించాలని కోరారు. మహిళలతో అసభ్యకరంగా ప్రవర్తిస్తే ఎంతటి వారైనా చట్టానికి అతీతులు కారని, చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వం ప్రత్యేక దృష్టితో విచారణ కొనసాగిస్తుందని తెలిపారు. మహిళలకు భద్రత, గౌరవం, స్వేచ్ఛ కల్పించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని ఐలయ్య (Beerla Ilaiah) వెల్లడించారు.

Read Also: బండి సంజయ్‌పై సీపీఐ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>