Mobile Popup Ad
Mobile Popup Ad

సీఎం విజయ్ జ్యోతిష్యుడికి ప్రభుత్వంలో కీలక పదవి

కలం, వెబ్ డెస్క్: తమిళనాడు సీఎం విజయ్ (CM Vijay) తన టీంను సిద్ధం చేసుకుంటున్నారు. ఇప్పటికే ఇద్దరు సెక్రటరీలను నియమించుకోగా.. తాజాగా ప్రముఖ జ్యోతిష్యుడు, న్యూమరాలజిస్ట్‌గా పేరొందిన రిక్కీ రధన్ పండిట్ వెట్రివల్‌ను సీఎంకు పొలిటికల్ ఓఎస్డీగా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. విజయ్‌కు సన్నిహితుడిగా, ఆధ్యాత్మిక సలహాదారుగా చెప్పుకునే ఈయన..’టీవీకే సునామీ లాంటి విజయం సాధించబోతుంది’ అని పలుమార్లు ప్రకటించారు. అన్నట్టుగానే టీవీకే భారీ విజయం సాధించడంతో ఈయన పేరు మారుమోగింది. తాజాగా, అత్యంత కీలకమైన పొలిటికల్ ఓఎస్డీ పోస్టులో నియమిస్తూ సీఎం విజయ్ నిర్ణయం తీసుకున్నారు.

గతంలో జయలలితకు సలహాదారుగా..

రాజకీయ, సినీ వర్గాల్లో రధన్ పండిట్‌గా అత్యంత సన్నిహిత సంబంధాలుండే ఈయన స్వస్థలం ఊతుకులి ప్రాంతం. గతంలో జయలలిత సీఎంగా ఉన్నప్పుడు కూడా ఆధ్యాత్మిక సలహాదారుగా పనిచేశారు. అంతేగాకుండా, జయలలితకు కలిసి వస్తుందని, ఆమె ఇంగ్లీష్ పేరులో మార్పులు కూడా చేయించినట్లు చెబుతారు. గత 40 ఏళ్లుగా జ్యోతిష్యం, న్యూమరాలజీ, ఆధ్యాత్మిక రంగాల్లో పేరొందిన రధన్ పండిట్.. కొన్ని ప్రైవేట్ కంపెనీల్లో కూడా డైరెక్టర్ బాధ్యతల్లో ఉండటం గమనార్హం.

Read Also: సర్కారు బడులకు సెక్యూరిటీ ఏది?

Follow Us On: Sharechat

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>