ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత విలువైనది: ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి

కలం, మిర్యాలగూడ: ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత విలువైనదని మిర్యాలగూడ ఎమ్మెల్యే (Miryalaguda MLA) బత్తుల లక్ష్మారెడ్డి (Bathula Laxma Reddy) తెలిపారు. మిర్యాలగూడ పట్టణంలోని పలు వార్డుల్లో కొనసాగుతున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ‘SIR’ కార్యక్రమాన్ని ఆయన ఆదివారం క్షేత్రస్థాయిలో పర్యవేక్షించారు. పట్టణంలోని 18, 36, 37 వార్డుల్లోని పలు పోలింగ్ కేంద్రాలను ఆయన స్వయంగా సందర్శించి, అక్కడ జరుగుతున్న ఓటరు జాబితా సవరణ ప్రక్రియను పరిశీలించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి అధికారులతో మాట్లాడి.. కొత్త ఓటర్ల నమోదు, తప్పుల సవరణ, దరఖాస్తుల స్వీకరణ తదితర అంశాల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత విలువైనదని, అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించడమే లక్ష్యంగా అధికారులు నిబద్ధతతో పనిచేయాలని సూచించారు.

ఎన్నికల సంఘం జారీ చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా, ప్రతి అర్హత కలిగిన ఓటరుకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పారదర్శకంగా, వేగవంతంగా ఈ ప్రక్రియను పూర్తి చేయాలన్నారు. అలాగే, ప్రజలకు ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమంపై విస్తృతంగా అవగాహన కల్పించాలని, అర్హులైన వారు తమ ఓటరు వివరాలను సరిచేసుకునేలా అవసరమైన సహాయ సహకారాలు అందించాలని అధికారులను ఆదేశించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>