‘లెనిన్’ బాక్సాఫీస్ ర్యాంపేజ్.. 2 రోజులకే సెన్సేషన్

కలం, సినిమా : అక్కినేని అఖిల్(Akhil Akkineni) హీరోగా తెరకెక్కిన బిగ్గెస్ట్ యాక్షన్ మూవీ ‘లెనిన్'(Lenin)  బాక్సాఫీస్ వద్ద సాలిడ్ రన్ కొనసాగిస్తోంది. జులై 10న విడుదలైన ఈ సినిమా తొలి రోజు నుంచే పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుని, ప్రేక్షకుల ఆదరణతో కలెక్షన్ల పరంగా కూడా దూసుకెళ్తోంది. తాజాగా చిత్ర నిర్మాణ సంస్థ అన్నపూర్ణ స్టూడియోస్ విడుదల చేసిన అధికారిక పోస్టర్ ప్రకారం, ‘లెనిన్’ మూవీ  కేవలం రెండు రోజులలోనే ప్రపంచవ్యాప్తంగా రూ.37.2 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది. “వర్డ్ ఆఫ్ మౌత్ అద్భుతంగా పనిచేస్తుండగా, ప్రేక్షకుల ఆదరణ సినిమాను మరింత ముందుకు తీసుకెళ్తోంది” అంటూ చిత్రబృందం పేర్కొంది. ఇదే జోరు కొనసాగితే సినిమా మరింత భారీ వసూళ్ల దిశగా అడుగులు వేయనున్నట్లు ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

ఈ చిత్రంలో అఖిల్ సరసన భాగ్యశ్రీ బోర్స్ హీరోయిన్‌గా నటించగా, టాలెంటెడ్ దర్శకుడు మురళీ కిశోర్ అబ్బూరి ఈ సినిమాను తెరకెక్కించారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, అన్నపూర్ణ స్టూడియోస్, మనం ఎంటర్‌ప్రైజెస్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాకు థమన్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ప్రధాన ఆకర్షణగా నిలిచింది. అలాగే యాక్షన్ సన్నివేశాలు, ఎమోషనల్ కథనం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయని అభిమానులు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>