విజయదశమిని సంప్రదాయబద్ధంగా నిర్వహించుకోవాలి: లక్ష్మారెడ్డి

కలం, మిర్యాలగూడ: పట్టణంలోని ఎన్ఎస్పి క్యాంప్ గ్రౌండ్‌లో హిందూ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న విజయదశమి ఉత్సవాల ఏర్పాట్లలో భాగంగా ఆదివారం భూమి పూజ కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి (Bathula Laxma Reddy) ముఖ్య అతిథిగా హాజరై భూమి పూజలో పాల్గొన్నారు. అనంతరం ఉత్సవాల ప్రారంభానికి సూచికగా జెండాను ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… విజయదశమి ఉత్సవాలను ప్రజలందరూ భక్తిశ్రద్ధలతో, సంప్రదాయబద్ధంగా నిర్వహించుకోవాలని ఆకాంక్షించారు. ఉత్సవాల విజయవంతానికి కావలసిన పూర్తి సహకారాన్ని అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ చిలుకూరి సుధా బాలకృష్ణ, కాంగ్రెస్ నాయకులు, మున్సిపల్ కౌన్సిలర్లు, హిందూ ఉత్సవ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

వేడుకగా ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశాలు..

పేద, మధ్యతరగతి కుటుంబాల సొంతింటి కలను సాకారం చేయడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి పేర్కొన్నారు. దామరచర్ల మండలం కొత్తపేట తండాలో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన లక్ష్మారెడ్డి.. రిబ్బన్ కట్ చేసి నూతన గృహాలను ప్రారంభించారు. అనంతరం లబ్ధిదారుల కుటుంబ సభ్యులను కలిసి వారికి శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా గృహ వసతి కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. నూతన గృహాల్లో అడుగుపెట్టిన లబ్ధిదారుల కుటుంబాల్లో ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి. సొంతింటి కలను నిజం చేసినందుకు లబ్ధిదారులు ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డికి, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, అధికారులు, లబ్ధిదారుల కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>