కలం, వెబ్ డెస్క్ : ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థ వోల్గా వీడియోస్ (Volga Videos) వ్యవస్థాపకుడు గుడూరు ప్రసాద్‌కు సైబర్ నేరగాళ్లు భారీ షాక్ ఇచ్చారు. ఆయన అమెరికన్ ఎక్స్‌ప్రెస్ క్రెడిట్ కార్డు నుంచి ఏకంగా రూ.34.44 లక్షలు కాజేశారు. ఈ ఘటనపై బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఈ ఏడాది ఏప్రిల్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ నెలల్లో అమెజాన్ ముంబై, అమెజాన్ బీడీ పేర్లతో ఈ అనుమానాస్పద లావాదేవీలు జరిగినట్లు గుడూరు ప్రసాద్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే, ఈ డబ్బులు డ్రా అయిన సమయంలో తన మొబైల్‌కు ఎలాంటి ఓటీపీ గానీ, నోటిఫికేషన్ గానీ రాలేదని ఆయన తెలిపారు.
తన ఫోన్‌ను పరిశీలించగా అందులో ఓ అనుమానాస్పద యాప్ ఇన్స్టాల్ అయి ఉన్నట్లు గుర్తించానని, దాని ద్వారానే నేరగాళ్లు వివరాలు తస్కరించి ఈ మోసానికి పాల్పడి ఉంటారని బాధితుడు అనుమానం వ్యక్తం చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

