సీఈసీ రాజీనామా డిమాండ్.. వనపర్తిలో కాంగ్రెస్ ధర్నా

కలం, వనపర్తి: ఓట్ల చోరీ వ్యవహారంపై కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్‌ జ్ఞానేశ్‌కుమార్‌ తీసుకున్న నిర్ణయాలను నిరసిస్తూ, ఆయన రాజీనామా చేయాలని డిమాండ్‌ చేస్తూ సోమవారం వనపర్తి (Wanaparthy) సమీకృత కలెక్టరేట్‌ ఎదుట కాంగ్రెస్‌(Congress) ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించనున్నట్లు డీసీసీ అధ్యక్షుడు (DCC President) శివసేన రెడ్డి తెలిపారు.

ఏఐసీసీ పిలుపు మేరకు రాష్ట్రంలోని జిల్లా కేంద్రాల్లో చేపడుతున్న నిరసన కార్యక్రమాల్లో భాగంగా వనపర్తిలోనూ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. టీపీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేశ్‌కుమార్‌ గౌడ్‌ ఆదేశాల మేరకు ఉదయం 10 గంటలకు కార్యక్రమం ప్రారంభం కానుందని తెలిపారు. ఈ నిరసన కార్యక్రమానికి వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొంటారని శివసేన రెడ్డి పేర్కొన్నారు. కాంగ్రెస్‌  నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>