క్రికెట్ అభిమానులకు సచిన అరుదైన కానుక.. మ్యూజియానికి 26 బ్యాట్లు!

కలం, వెబ్ డెస్క్: క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ (Sachin Tendulkar) తన అంతర్జాతీయ క్రికెట్ కెరీర్‌కు సంబంధించిన అరుదైన జ్ఞాపకాలను అభిమానుల కోసం అందుబాటులోకి తీసుకురానున్నారు. ఈ క్రమంలో అంతర్జాతీయ క్రికెట్‌లో తాను ఉపయోగించిన 26 బ్యాట్ల (26 Bats) ను ముంబయి క్రికెట్ సంఘం (ఎంసీఏ) ఆధ్వర్యంలోని శరద్ పవార్ క్రికెట్ మ్యూజియానికి బహుమతిగా అందజేయనున్నారు. వీటిలో అంతర్జాతీయ మ్యాచుల్లో శతకాలు సాధించేందుకు ఉపయోగించిన కొన్ని ప్రత్యేక బ్యాట్లు కూడా ఉన్నాయి.

బ్యాట్లతో పాటు తాను ఉపయోగించిన హెల్మెట్లు, జెర్సీలు, కెరీర్‌లోని చారిత్రాత్మక ఘట్టాలకు సంబంధించిన వ్యక్తిగత నోట్స్‌ను కూడా మ్యూజియానికి అందించనున్నారు. ఈ అరుదైన వస్తువులను ‘బ్యాటోగ్రఫీ’ పేరుతో ప్రత్యేక ప్రదర్శనగా ఏర్పాటు చేయనున్నారు. ఈ ప్రదర్శనను నవంబర్ 16న నిర్వహించనున్న ప్రత్యేక కార్యక్రమంలో ఆవిష్కరించనున్నారు.

అంతర్జాతీయ క్రికెట్‌కు సచిన్ వీడ్కోలు పలికి 13 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. 2013 నవంబర్ 16న ముంబయిలోని వాంఖడే స్టేడియంలో వెస్టిండీస్‌తో జరిగిన టెస్టు మ్యాచ్‌తో సచిన్ తన 24 ఏళ్ల అంతర్జాతీయ క్రికెట్ ప్రస్థానానికి ముగింపు పలికారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>