మీర్‌పేట్‌లో దారుణం.. ఇంట్లోనే మహిళ హత్య!

కలం, వెబ్ డెస్క్: హైదరాబాద్‌లోని మీర్‌పేట్ (Meerpet) పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ ఘటన చోటుచేసుకుంది. జిల్లెలగూడలోని దత్తునగర్ గల శ్రీ లక్ష్మీ రెసిడెన్సీ అపార్ట్ మెంట్‌లో మహిళ దారుణ హత్య (Woman Murder) కు గురైంది. వివరాల్లోకి వెళితే.. తమిళనాడుకు చెందిన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి అరుణ్​ కుమార్, తన భార్య అనిత, పిల్లలతో కలిసి గత నాలుగేళ్లుగా శ్రీ లక్ష్మీ రెసిడెన్సీ మూడో అంతస్తులో అద్దెకు ఉంటున్నారు.

బుధవారం పిల్లలు పాఠశాల నుంచి ఇంటికి తిరిగి రాగా, తల్లి అనిత రక్తపు మడుగులో పడి ఉండటాన్ని గమనించి తీవ్ర భయాందోళనకు గురయ్యారు. వెంటనే తండ్రికి సమాచారం అందించారు. కుటుంబ సభ్యులు ఆమెను హుటాహుటిన సమీపంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా, అప్పటికే ఆమె మృతిచెందినట్లు వైద్యులు ధృవీకరించారు.

సమాచారం అందుకు డీసీపీ రాజేష్​, ఆదిభట్ల ఏసీపీ ప్రదీప్ కుమార్ రెడ్డి, మీర్‌పేట్ ఇన్‌స్పెక్టర్ శోభన్ కుమార్ టీమ్‌తో కలిసి అపార్ట్‌మెంటుకు చేరుకుని ఆధారాలు సేకరించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. గుర్తుతెలియని వ్యక్తులు ఈ హత్యకు పాల్పడినట్లు ప్రాథమికంగా భావిస్తున్న పోలీసులు, సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తూ నిందితుల కోసం గాలిస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>