ఒక్కో ఇంటి నిర్మాణానికి ప్రభుత్వం రూ. 5 లక్షలు: ఎమ్మెల్యే బండ్ల

కలం, జోగులాంబ గద్వాల: అర్హులైన నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తున్నట్లు ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి (Bandla Krishna Mohan Reddy) తెలిపారు. శుక్రవారం గద్వాల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గద్వాల నియోజకవర్గంలోని గుడిసెల్లో నివసిస్తున్న 85 మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలను పంపిణీ చేశారు.

ఒక్కో ఇంటి నిర్మాణానికి ప్రభుత్వం రూ.5 లక్షలు అందిస్తోందని, లబ్ధిదారుల ఖాతాల్లోనే నగదు జమ అవుతుందని ఎమ్మెల్యే‌ తెలిపారు. మధ్యవర్తులను ఆశ్రయించకుండా మంజూరైన ఇళ్ల నిర్మాణాలను ప్రారంభించాలని ఆయన సూచించారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ ఛైర్‌పర్సన్‌ తుమ్మల జయలక్ష్మి, రాష్ట్ర బోయ వాల్మీకి ఫెడరేషన్ చైర్మన్ గట్టు తిమ్మప్ప, ఉమ్మడి‌ జిల్లా డీసిసిబి డైరెక్టర్ సుభాన్,‌ గద్వాల వ్యవసాయ మార్కెట్ యార్డు చైర్మన్ కుర్వ హన్మంతు, నాయకులు‌, తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>