కలం, నిర్మల్ : సారంగాపూర్ మండలం చించోలి (బి) (Chincholi) గ్రామంలో సీసీ కెమెరాల ఏర్పాటు ఆవశ్యకతపై నిర్మల్ రూరల్ సీఐ కృష్ణ (Nirmal Rural CI Krishna) బుధవారం గ్రామస్థులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామంలోని ప్రధాన కూడళ్లు, వ్యాపార సంస్థలు, ప్రజల రాకపోకలు ఎక్కువగా ఉండే ప్రాంతాలలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని సూచించారు. సీసీ కెమెరాల వల్ల నేరాల నియంత్రణతో పాటు ఘటనలపై దర్యాప్తు వేగవంతమవుతుందని తెలిపారు.
ప్రజలు పోలీసులకు సహకరిస్తూ గ్రామ భద్రతలో భాగస్వాములు కావాలని సీఐ కృష్ణ పిలుపునిచ్చారు. అనంతరం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన వనమహోత్సవ కార్యక్రమంలో భాగంగా అరె మైసమ్మ దేవాలయ ప్రాంగణంలో గ్రామస్థులతో కలిసి పోలీసులు మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో సారంగాపూర్ ఎస్సై శ్రీకాంత్, గ్రామ సర్పంచ్ సాయన్న, ఉప సర్పంచ్ పోశెట్టి, పంచాయతీ కార్యదర్శి సౌజన్య, గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు, గ్రామస్థులు పాల్గొన్నారు.

