కలం, వెబ్‌డెస్క్: ఏపీలోని విశాఖపట్నంలో కొండల తవ్వకాలపై హీరోయిన్ చాందినీ చౌదరి (Chandini Chowdary) సోషల్ మీడియా వేదికగా చేసిన పోస్ట్ హాట్ టాపిక్‌గా మారింది. వైజాగ్‌కు చెందిన చాందినీ చౌదరి షార్ట్ ఫిల్మ్స్ తో తన కెరీర్ ప్రారంభించి సినిమా హీరోయిన్‌గా మారింది. తాజాగా అభివృద్ధి పనుల్లో భాగంగా వైజాగ్‌లో జరుగుతున్న కొండల తవ్వకాలపై ఆమె తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. తన సొంత ఊరు అయిన వైజాగ్‌లో విధ్వంసం జరుగుతోందని తన పోస్టులో పేర్కొంది. దీనికి తవ్వకాలు జరుగుతున్న ఒక కొండ ఫోటోను కూడా జోడిచ్చింది.
నా సొంత ఊరు వైజాగ్ పరిస్థితి చూస్తుంటే నా గుండె తరుక్కుపోతోంది. అభివృద్ధి పట్టణీకరణ పేరుతో ఎటు చూసినా కొండల తవ్వకాలే కనిపిస్తున్నాయి. అని చాందినీ తన పోస్టులో పేర్కొంది. వైజాగ్ వాసులు, నేచర్ లవర్స్ చాందినీ పోస్టుకు మద్దతు తెలుపుతున్నారు. వైసీపీ సోషల్ మీడియాలో కూడా చాందినీ పోస్టు వైరల్‌గా మారింది.

