Mobile Popup Ad
Mobile Popup Ad

సీఎంఆర్ఎఫ్ చెక్కు అందజేసిన ఎమ్మెల్యే ఏలేటి

క‌లం, నిర్మ‌ల్‌: అనారోగ్యంతో బాధ‌ప‌డుతూ ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్న ఓ వ్య‌క్తికి బీజేఎల్పీ నేత‌, ఎమ్మెల్యే ఏలేటి మ‌హేశ్వ‌ర్ రెడ్డి (MLA Alleti Maheshwar Reddy) సీఎంఆర్ఎఫ్ (CMRF) చెక్కు అంద‌జేశారు. నిర్మ‌ల్ (Nirmal) నియోజ‌క‌వ‌ర్గంలోని సోన్ మండ‌ల కేంద్రానికి చెందిన క‌ట్టే ల‌క్ష్మ‌ణ్ కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధ ప‌డుతున్నాడు. ప్ర‌స్తుతం హైద‌రాబాద్‌లోని నిమ్స్ ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్నాడు. ఆయ‌న‌కు సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి రూ.3.50 ల‌క్ష‌లు మంజూరు అయ్యాయి. ఈ న‌గ‌దుకు సంబంధించిన చెక్కును ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి శుక్రవారం ల‌క్ష్మ‌ణ్‌ కుటుంబ సభ్యులకు అందజేశారు. గత ఏడాది కాలంగా బాధితుల‌కు రూ.15 లక్షలు మంజూరైన‌ట్లు ఆయ‌న‌ తెలిపారు. చెక్కు మంజూరు చేయించిన ఎమ్మెల్యేకు బాధిత‌ కుటుంబసభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>