Mobile Popup Ad
Mobile Popup Ad

సిపిఐ నేత దొంతరవేన వెంకన్న కన్నుమూత

కలం, కరీంనగర్ బ్యూరో : భారత కమ్యూనిస్టు పార్టీ జిల్లా మాజీ కౌన్సిల్ సభ్యుడు (CPI Leader) దొంతరవేన వెంకన్న (Dontharavena Venkanna) ఆకస్మిక మరణం పట్ల సిపిఐ జిల్లా నాయకులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మృతి పార్టీకి తీరని లోటని పేర్కొంటూ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. సిపిఐ సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి, జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్ మాట్లాడుతూ.. చిగురుమామిడి మండలం గాగిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన వెంకన్న గత మూడు దశాబ్దాలుగా కమ్యూనిస్టు ఉద్యమంలో చురుకుగా పనిచేశారని తెలిపారు. పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి, నిబద్ధతతో ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కృషి చేసిన నాయకుడిగా ఆయనను గుర్తు చేసుకున్నారు.

రైతులు, కార్మికుల సమస్యలపై ఎప్పటికప్పుడు ప్రజాప్రతినిధులు, అధికారుల దృష్టికి తీసుకెళ్లి వారి హక్కుల కోసం పోరాడిన వ్యక్తిగా వెంకన్న సేవలు చిరస్మరణీయమని తెలిపారు. ప్రజల కోసం అంకితభావంతో పనిచేసిన మంచి మనసున్న నాయకుడిని (CPI Leader) కోల్పోవడం బాధాకరమని అన్నారు. వెంకన్న కుటుంబానికి సిపిఐ పార్టీ అండగా ఉంటుందని చాడ వెంకటరెడ్డి (Chada Venkat Reddy), పంజాల శ్రీనివాస్ తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా పార్టీ నాయకులు ఆయనకు ఘనంగా నివాళులర్పిస్తూ ప్రగాఢ సంతాపం ప్రకటించారు.

Read Also: హాట్ టాపిక్.. తెలంగాణ బీజేపీలో ‘అవతార్ పురుష్’ సెగ..!

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>