కలం, వెబ్ డెస్క్: కేరళం సీఎం పినరయి విజయన్ (Pinarayi Vijayan) తన పదవికి రాజీనామా చేశారు. ఎన్నికల్లో ఓటమి పాలు కావడంతో గవర్నర్‌ను కలిసి రాజీనామా లేఖను సమర్పించారు. కొత్త ప్రభుత్వం ఏర్పడే వరకు ఆపద్ధర్మ సీఎంగా కొనసాగాలని కోరగా.. అందుకు అంగీకరించారు. కాంగ్రెస్ ఆధ్వర్యంలోని యూడీఎఫ్ 99 సీట్లతో ఆధిక్యంలో కొనసాగుతుడగా, ఎల్డీఎఫ్ 35 సీట్లలో ఆధిక్యంలో ఉంది. బీజేపీ మూడు సీట్లు, ఇతరులు మూడు సీట్లలో ముందంజలో ఉన్నారు. అర్ధరాత్రి లోగా పూర్తి ఫలితాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.
దేశంలో చివరి లెఫ్ట్ సీఎంగా రికార్డ్..
సీపీఐలో సీనియర్ నేతగా ఉన్న పినరయి విజయన్.. దేశంలో వామపక్షాలకు సంబంధించి ఏకైక సీఎంగా ఉన్నారు. ప్రస్తుతం ఆయన రాజీనామాతో దేశ వ్యాప్తంగా వామపక్ష ప్రభుత్వాలు కనుమరుగైనట్లు అయిపోయాయి. పినరయి విజయన్ మొదటిసారి కేరళం ముఖ్యమంత్రిగా 2016 మే 25న బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత 2021లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ గెలిచి రెండోసారి సీఎం బాధ్యతలు స్వీకరించారు. మూడోసారి కూడా ముఖ్యమంత్రి కావాలన్నా కోరికను నెరవేరకుండానే.. నిష్క్రమించాల్సి వచ్చింది. పినరయి విజయన్ నాయకత్వంలో కేరళం విద్య, వైద్యం సహా పలు రంగాల్లో కీలక పురోగతి సాధించింది.

