నిర్మల్ గ్రామాల్లో ఆలయ పనులకు నిధుల వరద

కలం, నిర్మల్ : నిర్మల్ నియోజకవర్గంలోని గ్రామాల్లో దేవాలయాల నిర్మాణం, పునర్నిర్మాణం, అభివృద్ధి పనులకు ప్రభుత్వం రూ.1,01,95,321 నిధులు మంజూరు చేసిందని బీజేఎల్పీ నేత, నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి (Alleti Maheshwar Reddy) శుక్రవారం తెలిపారు. ఎండోమెంట్స్ కమిషనర్ కార్యాలయం ద్వారా ఆయా పనులకు టెండర్లు మంజూరయ్యాయని పేర్కొన్నారు. సోన్ మండలం కడ్తాల్ గ్రామంలోని శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి ఆలయ గర్భాలయ నిర్మాణానికి రూ.39,81,037, లక్ష్మణచందా మండలం చింతల్‌చాంద గ్రామంలోని శ్రీ వినాయక స్వామి కళ్యాణ మండపం నిర్మాణానికి రూ.26,34,918, దిలావర్‌పూర్‌లోని శ్రీ పోచమ్మ ఆలయ షెడ్ నిర్మాణానికి రూ.15,62,895 మంజూరయ్యాయి.

అలాగే సారంగాపూర్ మండలం ధని గ్రామంలోని గుట్ట పోచమ్మ ఆలయ ప్రహరీ గోడ నిర్మాణానికి రూ.10,54,715, జామ్ (చిన్నూరు) గ్రామంలోని శ్రీ హనుమాన్ ఆలయ పునర్నిర్మాణానికి రూ.9,61,756 నిధులు కేటాయించారు. ఆయా గ్రామాల్లో ఆలయాల నిర్మాణం, అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయించడంపై ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డికి గ్రామాల ప్రజలు, భక్తులు కృతజ్ఞతలు తెలిపారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>