Mobile Popup Ad
Mobile Popup Ad

విజయ్ ప్రభుత్వం కూలిపోవచ్చు.. స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు

కలం, వెబ్ డెస్క్ : తమిళనాడు రాజకీయాల్లో పొలిటికల్ హీట్ మొదలయింది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణస్వీకారం చేసిన కొన్ని రోజులకే రాజకీయాల సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ఈ క్రమంలో మాజీ సీఎం, డీఎంకే అధినేత ఎం.కే స్టాలిన్ (MK Stalin) సీఎం విజయ్ (Vijay) పై విమర్శనాస్త్రాలు సంధించడం మొదలుపెట్టారు. ఏ క్షణమైన విజయ్ ప్రభుత్వం కూలిపోయే అవకాశాలున్నాయని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన వ్యాఖ్యలు తమిళనాడు రాజకీయాలతో పాటు దేశరాజకీయాల్లో తీవ్ర కలకలం రేపుతున్నాయి.

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైన తరువాత మొదటిసారిగా డీఎంకే శ్రేణులను ఉద్దేశించి స్టాలిన్ (MK Stalin) మాట్లాడారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో ఎప్పుడైనా ఎన్నికలు రావొచ్చని.. అందుకోసం డీఎంకే శ్రేణులు సిద్ధంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. 2029లో జరిగే లోక్‌సభ ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికలు కూడా వచ్చే అవకాశాలు బలంగా ఉన్నాయని అంచనా వేశారు. రాబోయే ఎన్నికల్లో కచ్చితంగా గెలిచి తీరుతాం అని ఎంకే స్టాలిన్ ధీమా వ్యక్తం చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>