పెళ్లి చేయ‌డం లేద‌ని మైన‌ర్ ఆత్మ‌హ‌త్య‌!

క‌లం, వెబ్‌డెస్క్‌: ప్రేమించిన అమ్మాయితో పెళ్లి చేయాల‌ని త‌ల్లిదండ్రుల‌ను కోరిన ఓ మైన‌ర్ (Minor) బాలుడు, వారు పెళ్లికి ఇంకా స‌మ‌యం ఉంంద‌ని నిరాక‌రించ‌డంతో మ‌న‌స్తాపానికి గురై ఆత్మ‌హ‌త్య (Suicide) చేసుకున్నాడు. ఈ విషాద ఘ‌ట‌న విజ‌య‌న‌గ‌రం (Vizianagaram) జిల్లా శృంగ‌వ‌ర‌పుకోట మండ‌లం చీడిపాలెం గ్రామంలో చోటు చేసుకుంది. స్థానికంగా ఇంట‌ర్ ఫ‌స్ట్ ఇయ‌ర్ చ‌దువుతున్న నాగ మణికంఠ (16) కొంతకాలంగా ఓ యువతిని ప్రేమిస్తున్నాన్నాడు. అయితే వెంటనే తనకు పెళ్లి జరిపించాలని కుటుంబసభ్యుల వద్ద పదే పదే రిక్వెస్ట్ చేస్తున్నాడు. అయితే అతడి వయసురీత్యా ఇంకా చట్టపరమైన అర్హత రాలేదని, పెళ్లికి ఇంకా చాలా సమయం ఉందని తల్లిదండ్రులు అతనికి సర్దిచెప్పి మందలించారు.

పెద్దల మాటలతో తీవ్ర మనస్తాపానికి గురైన‌ మణికంఠ ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుమారుడి ఆకస్మిక మరణంతో ఆ తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. చ‌దువు, భవిష్యత్తు గురించి ఆలోచించాల్సిన చిన్న‌ వయసులో పెళ్లి గురించి ఆలోచించ‌డం, చిన్న మనస్పర్థలకే నిండు ప్రాణాన్ని తీసుకోవ‌డం అంద‌రినీ తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>