కలం, వెబ్ డెస్క్: సచివాలయంలో నీటిపారుదల ప్రాజెక్టులపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Uttam Kumar Reddy) అధ్యక్షతన ఉన్నతస్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో డిండి, అచ్చంపేట సాగునీటి ప్రాజెక్టుల పురోగతిపై ఉన్నతాధికారులతో మంత్రి సమగ్రంగా పరిశీలించారు. ప్రాజెక్టుల పనులు, భూసేకరణ, పునరావాస ప్రక్రియపై చర్చించారు. పెండింగ్ పనులు, క్షేత్రస్థాయి సమస్యలపై అధికారుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు.
పనులు నిర్దేశిత గడువులో పనులు పూర్తి చేసేలా కార్యాచరణ రూపొందించాలని.. సాగునీటి ప్రాజెక్టుల పనుల్లో వేగం పెంచాలని మంత్రి ఆదేశించారు. ప్రాజెక్టుల అమలులో ఎదురవుతున్న అడ్డంకులను సత్వరమే పరిష్కరించాలన్నారు. డిండి, అచ్చంపేట ప్రాంతాల రైతులకు సాగునీరు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. అలాగే పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పురోగతిపై మంత్రి (Uttam Kumar Reddy) సమీక్ష నిర్వహించారు.
సాగునీటి ప్రాజెక్టులపై నిర్వహించిన సుదీర్ఘ సమీక్షలో ప్రత్యేక ఆహ్వానితుడిగా ముఖ్యమంత్రి కార్యదర్శి మాణిక్ రాజ్ పాల్గొన్నారు. వీరితో పాటు నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీధర్, పునరావాసం, భూసేకరణ కమిషనర్ శివకుమార్ నాయుడు, జాయింట్ సెక్రటరీ కె. శ్రీనివాస్, ఇంజినీర్-ఇన్-చీఫ్ రమేష్‌బాబు, సంబంధిత చీఫ్ ఇంజినీర్లు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
Also Read : దానం నాగేందర్ అనర్హత వేటుపై షాకింగ్ ట్విస్ట్.. సుప్రీంకోర్టు కీలక నిర్ణయం!
Follow Us On : WhatsApp

